దేవరపై ట్రోలింగ్‌.. యూట్యూబర్లపై మండిపడ్డ విశ్వక్‌సేన్‌ | Vishwak Sen Counters To Youtuber Who Trolls Jr NTR For Devara Movie Trailer Look, Post Goes Viral | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్టీఆర్‌ లుక్స్‌పై ట్రోలింగ్‌.. కాలిపోయిన మొహమంటూ విశ్వక్‌ కౌంటర్‌

Published Thu, Sep 12 2024 5:32 PM | Last Updated on Thu, Sep 12 2024 6:20 PM

Vishwak Sen Counters to Youtuber Who Trolls Jr NTR For Devara Trailer Look

జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర ట్రైలర్‌ గురించ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఈ ట్రైలర్‌ చూస్తుంటే ఆచార్య గుర్తొస్తోందని ట్రోల్‌ చేస్తున్నారు. కొందరు యూట్యూబర్స్‌ అయితే ఏకంగా ఎన్టీఆర్‌ లుక్స్‌ మీద కూడా సెటైర్లు వేశారు. ట్రైలర్‌ చూడబుద్ధి కాలేదు, ఏమంత ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయలేదనిపిస్తోంది. ఆయన లుక్స్‌ కూడా బాలేవని కామెంట్లు చేశారు.

సపోర్ట్‌ లేకుండా కూర్చో..
దీంతో తారక్‌ వీరాభిమాని, హీరో విశ్వక్‌సేన్‌ సదరు యూట్యూబర్లపై తీవ్రంగా మండిపడ్డాడు. వీడు నా పేరు ఖరాబ్‌ చేయడానికే పుట్టాడు. నువ్వు ముందు ఆ గోడ సపోర్ట్‌ లేకుండా రెండు నిమిషాలు కూర్చో.. తర్వాత సినిమాను, ఆడియన్స్‌ను ఉద్ధరిద్దువు కానీ.. నీ ముఖం ఆల్‌రెడీ కాలిపోయినట్లు ఉంది. అలాంటి నువ్వే అందం గురించి మాట్లాడాలి మరి! అని కౌంటర్‌ ఇచ్చాడు. ఇది చూసిన తారక్‌ ఫ్యాన్స్‌.. అదీ.. అట్లా గడ్డి పెట్టు అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ నెలలోనే దేవర
ఇకపోతే ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌ అలీఖాన్, ప్రకాశ్‌ రాజ్, శ్రీకాంత్‌ కీలకపాత్రల్లో నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు. దేవర ఫస్ట్‌ పార్ట్‌ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

 

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement