దీపావళికి రాకీ | Vishwak Mechanic Rocky For Diwali | Sakshi
Sakshi News home page

దీపావళికి రాకీ

Published Fri, Jul 19 2024 12:44 AM | Last Updated on Fri, Jul 19 2024 12:44 AM

Vishwak Mechanic Rocky For Diwali

దీపావళికి థియేటర్స్‌కు వస్తున్నాడు మెకానిక్‌ రాకీ. విశ్వక్‌ సేన్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న యాక్షన్‌ చిత్రం ఇది.

ఈ చిత్రాన్ని అక్టోబరు 31న దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా గురువారం ప్రకటించి,  విశ్వక్‌ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్‌. కామెడీ, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement