మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శర్మ నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణచైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' బుక్ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. టికెట్ కొన్నవారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది. ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు. అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది. ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు. సినిమాలో వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు.' అని అన్నారు. కాగా.. ఇటీవలే మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై టాలీవుడ్‌లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కృష్ణచైతన్య స్పష్టం చేశారు. కథ సిద్దమయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పవర్ పేట గురించి త్వరలోనే అప్‌డేట్ ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment