గోదావరి గ్యాంగ్స్‌ రెడీ  | Sakshi
Sakshi News home page

గోదావరి గ్యాంగ్స్‌ రెడీ 

Published Sun, Mar 17 2024 12:18 AM

Vishwak Sen Gangs Of Godavari Releasing On 17th May - Sakshi

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను మే 17న రిలీజ్‌ చేయనున్నట్లు శనివారం యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ అంజలి ఓ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

1960లలో గోదావరి ప్రాంతంలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమాను ఈ నెల 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ పూర్తి కాకపోవడం వల్ల మే 17కి వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement