'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌ని ఊరమాస్ సీన్స్‌తో నింపేశారు. విశ్వక్ సేన్ యాటిట్యూడ్ దగ్గర నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో జరిగే రాజకీయాలు, యాక్షన్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాల్ని మిక్స్ చేసిన ట్రైలర్ చూస్తుంటేనే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దీనితో పాటు బూతులు కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో కూడా రెండు చోట్ల ఈ పదాలు వినిపించాయి.
(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)
ట్రైలర్ చూస్తే పూర్తిగా రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. రత్నాకర్ అనే కుర్రాడు.. ఊరి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత జరిగే డ్రామా, ఎత్తుకు పై ఎత్తులు ఇలా ట్రైలర్ అంతా రేసీగా కనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో మే 31న తెలిసిపోతుంది. ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్ కాగా, అంజలి కీలక పాత్ర పోషించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)
Comments
Please login to add a commentAdd a comment