‘మెకానిక్‌ రాకీ’ ఐదు నిమిషాలు కూడా బోర్‌ కొట్టదు : విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Comments On Mechanic Rocky At Pre Release Event | Sakshi
Sakshi News home page

పది సినిమాల అనుభవంతో చెబుతున్నా... ‘మెకానిక్‌ రాకీ’ బోర్‌ కొట్టదు: విశ్వక్‌ సేన్‌

Published Mon, Nov 18 2024 9:07 AM | Last Updated on Mon, Nov 18 2024 9:29 AM

Vishwak Sen Comments On Mechanic Rocky At Pre Release Event

‘‘నేను పది సినిమాలు చేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. నా గత సినిమాల కన్నా చాలా భిన్నమైన సినిమా ‘మెకానిక్‌ రాకీ’. ఐదు నిమిషాలు కూడా బోర్‌ కొట్టదు. 21న ‘మెకానిక్‌ రాకీ’ పెయిడ్‌ ప్రిమియర్స్‌ వేస్తున్నాం. థియేటర్స్‌కు రండి. నిర్మాత రామ్‌గారు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఆయన కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తాను’’ అని విశ్వక్‌ సేన్‌ అన్నారు. 

రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘మెకానిక్‌ రాకీ’ మంచి సినిమా’’ అన్నారు. ‘‘విశ్వక్‌ సేన్‌ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రామ్‌ తాళ్లూరి. ఈ వేడుకలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మాట్లాడి, ‘మెకానిక్‌ రాకీ’ విజయాన్ని ఆకాంక్షించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement