ఇన్‌స్టాగ్రామ్‌ ఎందుకు డీయాక్టివేట్‌ చేశానంటే?: విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Reveals the Reason for Instagram Deactivate | Sakshi
Sakshi News home page

Vishwak Sen: నటి వల్ల సోషల్‌ మీడియాకు దూరం? విశ్వక్‌ సేన్‌ ఆన్సరిదే!

Published Sun, Jul 28 2024 5:33 PM | Last Updated on Sun, Jul 28 2024 6:17 PM

Vishwak Sen Reveals the Reason for Instagram Deactivate

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం మెకానిక్‌ రాకీ. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 31న రిలీజ్‌ చేయనున్నారు. ఆదివారం (జూలై 28న) సినిమా గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వక్‌సేన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది.

అందుకే సోషల్‌ మీడియాకు దూరం
ఏ నటి వల్ల మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా డిలీట్‌ చేశారు? సోషల్‌ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా ఉండట్లేదు? అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. అందుకు హీరో స్పందిస్తూ.. నువ్వు అమ్మాయిల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటావ్‌.. కానీ నేను అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో ఉంటాను. అయినా ఎవరో నటి గురించి నేనెందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేస్తాననుకున్నారు.

మొన్నే తెలిసొచ్చింది
సరే, అది పక్కన పెడితే.. మార్చి 29న నాకు 30 ఏళ్లు వచ్చాయని అర్థమైంది. ఇంకా ఫోన్‌ పట్టుకుని గంటలకొద్దీ కాలక్షేపం చేయడమేంటి? వయసొచ్చింది.. ఫోన్‌ పక్కనపెట్టి ఎక్కువ పని చేద్దామనుకున్నాను. అందుకనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేశాను. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను.మూవీ విడుదలైన వారం తర్వాత మళ్లీ కనిపించను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement