'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్! | Vishwak Sen Sensational Post On His Movie Release Gangs Of Godavari | Sakshi
Sakshi News home page

Vishwak Sen: ఎలాంటి సందేహం లేదు.. ఆ రోజు శివాలెత్తిపోద్ది: విశ్వక్‌సేన్ ఆన్‌ ఫైర్!

Published Sun, Oct 29 2023 12:08 PM | Last Updated on Sun, Oct 29 2023 12:38 PM

Vishwak Sen Sensational Post On His Movie Release Gangs Of Godavari - Sakshi

దాస్‌ కా ధమ్కీ అంటూ ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశ్వక్‌సేన్ మరోసారి థియేటర్లలో అలరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.  గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.   కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో విశ్వక్ సేన్ చేసిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 
 
గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీని ఉద్దేశించి నటుడు విశ్వక్‌ సేన్‌ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని రాసుకొచ్చారు. తాము అనుకున్న తేదీకే సినిమా విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. 

ఇన్‌స్టాలో రాస్తూ..'మనకు బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్‌ 8న వస్తున్నా. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, అట్టర్‌ ఫ్లాప్‌ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో, అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. తగ్గే కొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని నాకిప్పుడు అర్థమైంది. డిసెంబర్‌ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు' అంటూ విశ్వక్‌  చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

కాగా.. డిసెంబర్‌ 8న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కానుంది. అయితే అదే రోజు నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’, వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సైతం రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరీ ఆ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ని వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని.. ఈ విషయంపైనే విశ్వక్‌ అసహనానికి లోనయ్యారని వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఈ పోస్ట్‌ పెట్టినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement