'ఇంటిమేట్ సీన్స్‌'.. అందరినీ పంపించాకే తీశారు: అంజలి | Tollywood Actress Anjali Open About Intimate Scenes In Latest Web Series | Sakshi
Sakshi News home page

Anjali: 'నేను ఇప్పటివరకు ఇలాంటి సీన్స్‌ చేయలేదు'

Published Tue, Jul 23 2024 4:54 PM | Last Updated on Tue, Jul 23 2024 4:59 PM

Tollywood Actress Anjali Open About Intimate Scenes In Latest Web Series

ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరితో మెప్పించిన టాలీవుడ్ నటి అంజలి. ఇందులో వేశ్య పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది. మరోసారి అలాంటి డిఫరెంట్‌ పాత్రతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా అంజలి కీ రోల్‌ పోషించిన వెబ్ సిరీస్‌ బహిష్కరణ. ఇందులో ఆమె వేశ్య పాత్రలోనే కనిపించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్‌ చేయడంపై ఆమె స్పందించింది.

అంజలి మాట్లాడతూ.. 'నా కెరీర్‌ ప్రారంభంలో మంచి క్యారెక్టర్స్ వచ్చాయి.  నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్‌లనే ఎంచుకుంటా. కొన్ని సినిమాల కోసం ఏకంగా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. యాక్షన్‌ సీన్స్‌ కూడా డూప్‌ లేకుండా చేస్తా. నవరస అనే వెబ్ సిరీస్‌ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్‌ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు. అయితే ఈ సిరీస్‌లో ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించడంతో కాస్తా గందరగోళానికి గురయ్యా. ఆయితే ఆ సీన్స్‌ చేసేటప్పుడు అందరినీ బయటకు పంపి షూట్ చేశారు. నేను ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నా పాత్రకు అనుకున్నదానికంటే మంచి స్పందన వచ్చింది.' అని తెలిపింది.

అంతే కాకుండా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా రియాక్ట్ అయింది. నా గురించి ఎవరైనా తప్పుగా రాసినప్పుడు బాధపడతానని వెల్లడించింది. అలా వస్తున్నాయని చెప్పి.. నేను పెళ్లి చేసుకోలేను కదా? అని నవ్వుతూ సమాధామిచ్చింది. తనకు సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానంటోంది అంజలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement