పదహారణాల తెలుగు అమ్మాయి నటి అంజలి. అయితే ఈ బ్యూటీలోని నటిని ముందుగా గుర్తించి, ఆదరించింది మాత్రం తమిళ చిత్తమే. ఇక్కడ రామ్, వసంత బాలన్, శరవణన్ వంటి ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రం కట్రదు తమిళ్‌తోనే ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న అంజలి ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు నటిస్తూ వచ్చారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టి ఈమైపె పడింది. అలా అక్కడ కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా తమిళంలో నటుడు జయ్ సరసన నటించి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రంలో అంజలి నటించారు.
అప్పుడే వీరిమధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బెలూన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తింది. దీంతో కొన్నాళ్లు జయ్, అంజలి డీప్ లవ్‌లో మునిగి తేలినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక దశలో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం హోరెత్తింది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా విడిపోయినట్లు వార్తలు దొర్లాయి. నటి అంజలి కూడా ఆ మధ్య ఒక భేటీలో జయ్ పేరు చెప్పకుండా ఒక వ్యక్తితో రిలేషన్ ఏర్పరచుకున్న కారణంగా కెరీర్ పై దృష్టి పెట్టలేక పోయానని, అయితే అది తప్పుడు రిలేషన్ షిప్ అని తెలిసిరావడంతో ఆ బంధం నుంచి బయటికి వచ్చి మళ్లీ నటించడం ప్రారంభించానని చెప్పారు. కాగా ఇప్పుడు అంజలి ప్రేమ విఫలం కావడంతో ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధమవుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఓ వ్యాపారవేత్తతో అంజలి పెళ్లి కుదిరినట్లు, త్వరలోనే ఆమె పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment