దక్షిణాదిలో తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్‌గా నటించి, మెప్పించి హోమ్లీ గర్ల్ అని మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు అంజలి. కోలీవుడ్‌లో అయితే అంజలి ఓ వెలుగు వెలిగింది.
కట్రదు తమిళ్, అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలతో తమిళ అభిమానులను ఆకట్టుకుంది. భాష ఏదైనా.. ఎలాంటి పాత్రలోనైనా తనని తాను మార్చుకోగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది ఆమె.
కానీ అందరు ఊహించినట్టుగా అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. గ్లామర్ డోస్ పెంచినా అవకాశాలు అంతంత మాత్రమే. కొత్త హీరోయిన్లు రావడంతో ఆశించిన అఫర్స్ అందుకోలేకపోతుంది.
ఆకర్షణీయంగా కనిపించేందుకు సిద్ధమైనా.. అవకాశాలు తలుపు తట్టడంలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ బ్యూటీ ఉందట.
ఆ సమయంలో టాలీవుడ్‌లో మాచర్ల నియోజకవర్గంలో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఇకపై మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు ఈ భామ గ్లామర్ డోస్ పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment