అందం, అభినయం ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి నటి అంజలి. మొదట్లో తెలుగులో రంగ ప్రవేశం చేసినా గుర్తింపు వచ్చింది మాత్రం తమిళ చిత్రాలతోనే. రామ్ దర్శకత్వం వహించిన కట్టదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అంజలి తొలి చిత్రంతోనే తానేమిటో నిరూపించుకుంది. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమ దృషిని తన వైపు తిప్పుకుంది. అదే విధంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యక స్థానాన్ని ఏర్పరచుకుంది.
తెలుగు, మలయాళం వంటి ఇతర భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న అంజలి నట పయనం 17 ఏళ్లు. ఇప్పటికి ఆమె అర్ధసెంచరి కొట్టింది. అవును ఈమె నటిస్తున్న 50వ చిత్రం గురించి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. అమ్యూజ్‌మెంట్, ద3 ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ వేలాయుధం దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఈగై అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు చిత్ర వర్గాలు విడుదల చేశారు. ధరన్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు.
#Eegai ⚖️ pic.twitter.com/5oUYSW0J40
— Anjali (@yoursanjali) May 27, 2023
Comments
Please login to add a commentAdd a comment