నితిన్‌ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే: రష్మిక | Rashmika Mandanna Chit Chat With Media About Bheeshma Telugu Movie | Sakshi
Sakshi News home page

నితిన్ పవర్‌స్టార్‌ వీరాభిమాని: రష్మిక

Published Sun, Feb 16 2020 6:13 PM | Last Updated on Sun, Feb 16 2020 6:13 PM

Rashmika Mandanna Chit Chat With Media About Bheeshma Telugu Movie - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌, క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. 

ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ రష్మిక మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది" అని రష్మిక అన్నారు. 

'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు?
అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం.

సినిమా చూశారా?
లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా.

'భీష్మ'లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు?
మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు. 

అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?
ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను.

ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది?
మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ 'భీష్మ'లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. 'భీష్మ' అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే 'భీష్మ' చాలా మంచి ఫిల్మ్. 

వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా?
రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు. 

నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా?
మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. 'పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?' అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్. 

నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
నేను సరదాగా చెప్పడం లేదు. 'అ ఆ'లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు  నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం.

మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది?
నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు?
ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు 'భీష్మ'ను నిర్మించారు.

'ఛలో' నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు.

వాలంటైన్స్ డేని ఎలా గడిపారు?
వాలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వాలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వాలంటైన్స్ డేని గడిపి ఉండరు.

పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు?
కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి.  కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. 'భీష్మ' ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా.

అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు?
మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు.

చదవండి:
చిన్నప్పటి నుంచి విజయ్‌ అంటే క్రష్‌
‘లవ్‌యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement