
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ఈ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది.
ఇప్పటివరకు విడుదలైన సింగిలే అన్న సాంగ్, వాటే బ్యూటీ సాంగ్స్ బాగానే రీచ్ కాగా తాజాగా విడుదలైన సరాసరి సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. ‘రాములో రాములో’ తో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
చదవండి:
‘లవ్‌యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’
హీరో నితిన్ పెళ్లి వాయిదా..!
‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’
Comments
Please login to add a commentAdd a comment