‘భీష్మ’ మేకింగ్‌ : రష్మీక అల్లరే అల్లరి | Bheeshma Movie Making Video Out | Sakshi
Sakshi News home page

నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్‌ వీడియో

Feb 20 2020 3:33 PM | Updated on Feb 20 2020 3:47 PM

Bheeshma Movie Making Video Out - Sakshi

నితిన్ హీరోగా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా భీష్మ. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచాయి. మంచి హైప్‌తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై హీరో నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

(చదవండి : అదిరిపోయిన ‘భీష్మ’ ట్రైలర్‌)

శుక్రవారం (ఫిబ్రవరి 21న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం బృందం గురువారం మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది. సెట్స్‌లో  రష్మిక చేసే అల్లరి, నితిన్‌ కామెడీ పంచ్‌లతో మేకింగ్‌ వీడియో అదిరిపోయింది. సినిమాలో సెట్‌లో జరిగిన సందడి అంతా ఇందులో చూపించారు.

(చదవండి : భీష్మ సినిమా పేరు మార్చాలి)

 ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను బ్యాగ్రౌండ్ ప్లే చేస్తూ మేకింగ్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. షూటింగ్‌ టైంలో రష్మీక, డైరెక్టర్‌ వెంకీల మధ్య జరిగిన సరదా సన్నివేశాలను మేకింగ్‌ వీడియోలో చూపించారు. దర్శకుడి షర్ట్‌పై ‘హీ ఇజ్‌ ఏ వెరీ రోమాంటిక్‌ ఫెల్లో’  అని రష్మీక రాయడం బట్టి చూస్తే తెలుస్తుంది ఆమె భీష్మ సెట్‌లో ఎంత అల్లరి చేసిందో. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం నితిన్‌కి బ్రేక్‌ ఇస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement