‘లవ్‌యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ | Nithin Emotional Post After Bheeshma Movie Shooting Packup | Sakshi
Sakshi News home page

‘లవ్‌యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’

Published Sun, Feb 2 2020 2:33 PM | Last Updated on Sun, Feb 2 2020 2:35 PM

Nithin Emotional Post After Bheeshma Movie Shooting Packup - Sakshi

‘భీష్మ’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. యంగ్‌ హీరో నితిన్‌, క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పారు చిత్ర బృందం. ఈ సందర్భంగా సెట్‌లో చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంది. అనంతరం హీరో నితిన్‌ తన అధికారిక ట్విటర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు.  

‘వెంకీ కుడుముల ఐ లవ్ యూ.. నీ గురించి మాటల్లో చెప్పలేను. భీష్మ వంటి సినిమాను నాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రష్మిక నువ్వు నా ఫేవరేట్. నీతో మళ్లీ సినిమా చేసేందుకు ఎక్కువ వెయిట్‌ చేయలేను. ఈ చిత్రానికి కష్టపడిన, మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, సాంగ్స్‌, టీజర్‌లలో నితిన్‌-రష్మికల జోడీ చూడముచ్చటగా ఉందని, అదేవిధంగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే.  

ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తోంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 21 విడుదల కానున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

మహేశ్‌బాబు చిత్రంలో విజయ్‌ దేవరకొండ? 

మే నెలలో హీరో నితిన్‌ వివాహం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement