
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సింగిల్ యాంథమ్ సాంగ్‌లు కేక పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అస్త్రాన్ని చిత్ర బృందం వదిలింది. ‘వాటే బ్యూటీ’ అంటూ సాగే మాస్ సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేసింది. పూర్తి సాంగ్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఇక రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమోలో నితిన్, రష్మికలు తమ అదిరేటి స్టెప్పులతో మైమరిపించారు. ముఖ్యంగా రష్మిక ఈ వీడియోలో క్యూట్‌గా, ఫుల్ గ్లామర్‌తో కనిపిస్తుండటంతో యూత్‌కు ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ బూటీ’ సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. కాగా, మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాట హార్ట్ బీట్స్ పెంచేస్తుందని.. కొరియోగ్రఫీ గత్తర లేపుతుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా నితిన్-రష్మికల జోడి సూపర్బ్‌గా ఉందని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉందని పేర్కొంటున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్రిబ్రవరి 21న విడుదల కానుంది.
చదవండి:
ఆవగింజంత అదృష్టం.. దబ్బకాయంత దురదృష్టం
నితిన్, రష్మికలకు థ్యాంక్స్: హృతిక్
Comments
Please login to add a commentAdd a comment