మ్యాడ్ మూవీతో నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఆయ్. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి అంజి కె.మణపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. జీఎ2 బ్యానర్‌లో బన్నీవాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తీశారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైవర్షన్ బ్యూటీ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కాగా.. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సింగర్ మంగ్లీ ఆలపించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది.
Vibe to the Madness!🔥💃
Celebrate the Diversion Beauty ❤️🔥
Here's the lyrical video of #DiversionBeauty from #AAYMovie
▶️ https://t.co/HQ0F6LR2th
🎤 @IamMangli
✍️ @LyricsShyam
🎶 @arasadaajay#AAY #AAYonAUG15#AlluAravind @TheBunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan… pic.twitter.com/pzV4kmSLAj— Geetha Arts (@GeethaArts) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment