
ఒకసారి ఓటీటీకి అలవాటు పడితే అక్కడికి నుంచి బయటి రావడం చాలా కష్టం.సూర్య అలాగే అమెజాన్ కోసం సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.వెంకీ కూడా ప్రైమ్ కోసం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇచ్చేశాడు.ఇప్పుడు నితిన్ కూడా అదే దారిలో వెళ్లాలి అనుకుంటున్నాడట.
సెప్టెంబర్ లో హాట్ స్టార్ లోకి మాస్ట్రాతో వచ్చాడు నితిన్.పెద్ద సెన్సేషన్ సృష్టించకపోయినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నితిన్ కు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.అందుకే మరో మూవీని ఓటీటీ కోసం నిర్మించి, డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నాడట.అందుకోసం పర్ఫెక్ట్ ఓటీటీ స్టోరీకోసం వెదుకుతున్నాడట.
ఆకాశం నీ హద్దురా తర్వాత సూర్య ఇదే ఇలాగే వెళ్లాడు. ప్రైమ్ కోసం జైభీమ్ చిత్రం తీసి లాభాలను అందుకున్నాడు.నారప్ప తర్వాత వెంకటేష్ కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.నవంబర్ 25 దృశ్యం 2ను చిత్రాన్ని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. ఇక నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మాస్ మూవీని ఏప్రిల్ 29న డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు.ఆ తర్వాత ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నాడని టాక్.
Comments
Please login to add a commentAdd a comment