బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా తాజా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీలో ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ తిరిగి బ్యాగీ గ్రీన్ ధరించేందుకు సన్నద్దత వ్యక్తం చేశాడు. వార్నర్ రిటైర్మెంట్‌తో ఆసీస్‌కు ఓపెనర్ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే.
ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా స్టీవ్ స్మిత్‌ను ప్రయోగించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదు. దీంతో వార్నర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. కోడ్ స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్‌తో వార్నర్ మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నాడు. సెలెక్టర్ల నుంచి ఫోన్ రావడమే ఆలస్యమని ప్రకటించాడు.
కాగా, బీజీటీకి ముందు ఆసీస్‌కు ఓపెనింగ్ సమస్యతో పాటు కామెరూన్ గ్రీన్ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఉస్మాన్ ఖ్వాజా జోడీ కోసం ఆసీస్ సెలక్టర్లు సామ్ కోన్‌స్టాస్, మార్కస్ హ్యారిస్ పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా వార్నర్ ప్రకటన నేపథ్యంలో ఆసీస్ సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో రావడం దాదాపుగా ఖరారైంది. 37 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఆసీస్ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment