వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్.. ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బ్లాక్ క్యాప్స్ ప్రధాన బౌలర్లు మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌ను వీరిద్దరూ టార్గెట్ చేశారు.
పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్..
వీరిద్దరి బ్యాటింగ్ జోరు ఫలితంగా తొలి పవర్ ప్లేలో ఆస్ట్రేలియా ఏకంగా 118 పరుగులు చేసింది. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక ఫస్ట్ పవర్‌ప్లే స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 2015 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై 116 పరుగులు తొలి పవర్‌ప్లేలో కంగారులు సాధించారు.
తాజా మ్యాచ్‌తో ఆ రికార్డును ఆసీస్ అధిగమించింది. హెడ్, వార్నర్ ఇద్దరూ తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81 పరుగులు చేయగా.. హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: World Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment