IPL: రోహిత్‌ శర్మకు ఘోర అవమానం.. జట్టులోనూ చోటు కరువు! | IPL 2024: MS Dhoni Named As Captain Of IPL All Time Greatest Team, No Place For Rohit - Sakshi
Sakshi News home page

IPL All Time Greatest Team: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా ధోని.. రోహిత్‌కు చోటే లేదు!

Published Mon, Feb 19 2024 5:24 PM | Last Updated on Mon, Feb 19 2024 5:47 PM

Dhoni Named Captain of IPL Greatest All Time team No Place For Rohit - Sakshi

మహేంద్ర సింగ్‌ ధోని (PC: IPL/CSK)

IPL's greatest all-time team:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌, టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన​ ప్రీమియర్‌ లీగ్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌గా మిస్టర్‌ కూల్‌ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు.

మాజీ క్రికెటర్లు వసీం అక్రం, డేల్‌ స్టెయిన్‌, మాథ్యూ హెడన్‌, టామ్‌ మూడీ తదితరులతో పాటు సుమారు 70 మంది జర్నలిస్టులతో కూడిన నిపుణుల బృందం ఈ జట్టును ప్రకటించింది. అంతాకలిసి నాయకుడిగా ధోనికే ఓటు వేయడం విశేషం.

జట్టులో స్థానం సంపాదించింది వీళ్లే
ఇక ఈ జట్టులో టాపార్డర్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, టీమిండియా సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి, వెస్టిండీస్‌ పవర్‌హౌజ్‌ క్రిస్‌ గేల్‌లకు చోటు దక్కింది. అదే విధంగా మిడిలార్డర్‌లో సురేశ్‌ రైనా, ఏబీ డివిలియర్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ధోని స్థానం సంపాదించారు.

ఇక హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్‌ పొలార్డ్‌లు ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. రషీద్‌ ఖాన్‌, సునిల్‌ నరైన్‌, లసిత్‌ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చహల్‌ బౌలింగ్‌ దళ సభ్యులుగా ఎంపికయ్యారు. 

కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత ధోని సొంతం. ఇక విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు(7263) సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

మరోవైపు వార్నర్(6397).. ఐపీఎల్‌ లీగ్‌ రన్‌స్కోరర్లలో విదేశీ బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సురేశ్‌ రైనా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుగాంచగా.. డివిలియర్స్‌  151.68పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు.

అదే విధంగా.. ధోని 5 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు అత్యధికంగా 133 విజయాలు సాధించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక బౌలర్లలో చహల్‌ 187 వికెట్లు పడగొట్టి ఐపీఎల్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. పేసర్లు మలింగ, బుమ్రా ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.

రోహిత్‌కు ఘోర అవమానం
మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ను అరంగేట్రంలో(2022)నే విజేతగా నిలిపి సత్తా చాటాడు. అయితే, ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన సెంచరీ వీరుడు, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు:
మహేంద్ర సింగ్‌ ధోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, ఏబి డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యజువేంద్ర చహల్‌, లసిత్ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రా.

చదవండి: Mike Tyson: బీస్ట్‌లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement