ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే పిచ్చి. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, దర్బార్‌లో రజినీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి వైరల్ అయ్యేవి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఓ యాడ్‌లో నటించాడు. ఆ ప్రకటనలో దర్శకధీరుడు రాజమౌళి నటించడం మరో విశేషం.
నవ్వులు పూయిస్తున్న యాడ్
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’ అంటూ రాజమౌళి వార్నర్‌కి ఫోన్‌చేసి అడుగుతాడు. దానికి వార్నర్ బదులిస్తూ.. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు.
తనతో ఓ సినిమా చేయమని అడుగుతాడు. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో రాజమౌళి ఊహించుకుంటాడు. సెట్స్‌లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’ అని వార్నర్ అన్నప్పుడు రాజమౌళి చూసే చూపు నవ్వులు పూయిస్తుంది. కొన్ని సార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అటు సినీ ప్రియులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.
Favours are subject to market risk.
— CRED (@CRED_club) April 12, 2024
pic.twitter.com/QSPToEGYzg
Comments
Please login to add a commentAdd a comment