( ఫైల్ ఫోటో )
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న ఆసీస్ సీనియర్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ తిరిగి కివీస్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డే, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్‌కు సైతం ఈ జట్టులో చోటు దక్కింది.
టీ20 ప్రపంచకప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 21న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా బ్లాక్ క్యాప్స్‌తో కంగారులు ఆడనున్నారు. కాగా ఆసీస్ జట్టు ప్రస్తుతం విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది.
కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
చదవండి: IND vs ENG: రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్‌కు వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment