వార్నర్‌ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ | Allu Arjun Birthday Wishes To David Warner | Sakshi
Sakshi News home page

Allu Arjun David Warner: 'పుష్ప' కలిపింది ఇద్దరిని.. వార్నర్‌కి విషెస్

Oct 27 2024 1:21 PM | Updated on Oct 27 2024 3:20 PM

Allu Arjun Birthday Wishes To David Warner

హీరోలు పుట్టినరోజులు వస్తుంటాయి. కానీ ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకున్న సందర్భాలు తక్కువే. అలాంటిది అల్లు అర్జున్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ పుట్టినరోజుని గుర్తుంచుకుని మరీ శుభాకాంక్షలు చెప్పాడు. తన ఇన్ స్టాలో స్టోరీ కూడా పెట్టాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)

'అల వైకుంఠపురములో' సినిమా మహా అయితే తెలుగోళ్లకు మాత్రమే తెలుసుంటుంది. కానీ లాక్‌డౌన్ టైంలో బుట్టబొమ్మ పాటకు డేవిడ్ వార్నర్ రీల్స్ చేశాడు. తెలుగు నాట ఫుల్ ఫేమస్ అయిపోయాడు. 'పుష్ప' రిలీజ్ తర్వాత అయితే గడ్డం కింద చేయి పెట్టే మేనరిజమ్, శ్రీవల్లి పాటలో స్టెప్పులు వార్నర్‌కి తెగ నచ్చేశాయి. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఐపీఎల్‍‌లోనూ 'తగ్గేదే లే' మేనరిజమ్స్ చేసి చూపించేవాడు. అలా బన్నీ-వార్నర్ మధ్య సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ అవుతూనే ఉంది.

ఒకరి పుట్టినరోజున మరొకరు విషెస్ చెబుతూనే వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బన్నీ పుట్టినరోజు వార్నర్ స్టోరీ పెడితే..  ఇప్పుడు వార్నర్ బర్త్ డేకి అల్లు అర్జున్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టడం వీళ్ల మధ్య బాండింగ్ ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో అడుగుతున్నట్లు 'పుష్ప 2'లో వార్నర్‌కి చిన్న గెస్ట్ రోల్ ఇచ్చేస్తే అభిమానులు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారేమో?

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement