బుట్టబొమ్మ స్టెప్పులు.. వార్నర్ పోటీగా హాలీవుడ్ పాప్ సింగర్! | Pop Singer Ed Sheeran Dance Butta Bomma Song | Sakshi
Sakshi News home page

Ed Sheeran: ఇంటర్నేషనల్ రేంజ్ బుట్టబొమ్మ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు!

Published Wed, Mar 13 2024 1:42 PM | Last Updated on Wed, Mar 13 2024 3:27 PM

Pop Singer Ed Sheeran Dance Butta Bomma Song - Sakshi

బుట్టబొమ్మ పాట చెప్పగానే మనోళ్లకు అల్లు అర్జున్ గుర్తొస్తే.. విదేశీయులకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గుర్తొస్తాడు. ఎందుకంటే మనవరకు తెలిసిన ఈ పాటని వార్నర్.. తనదైన స్టెప్పులతో ఇంటర్నేషనల్ ప్రియులకు పరిచయం చేశాడు. ఇప్పుడు అతడికి పోటీగా హాలీవుడ్ పాప్ సింగర్ వచ్చేశాడు. తాజాగా జరిగిన ఓ పార్టీలో కష్టపడుతూనే బుట్టబొమ్మ స్టెప్పులేశాడు. ఇంతకీ ఎవరా సింగర్? ఏంటా సంగతి?

(ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు)

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. 2020 సంక్రాంతికి రిలీజైంది. అయితే సినిమా కంటే పాటలు అదిరిపోయే రేంజులో పాపులారిటీ సంపాదించుకున్నాయి. లాక్‌డౌన్ టైంలో పలువురు స్టార్స్ ఈ పాటకు స్టెప్పులేసి రీల్స్ చేశారు. వీళ్లందరి సంగతేమో గానీ ఆసీస్ క్రికెటర్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీతో వేసిన స్టెప్పులైతే కేక. ఇప్పటికీ వార్నర్ ఎక్కడ కనిపించినా మనోళ్లు.. బుట్టబొమ్మ స్టెప్పు వేయమని అరుస్తుంటారు. అలా డేవిడ్ వార్నర్ కాస్త బుట్టబొమ్మ వార్నర్ అయిపోయాడు.

ఇకపోతే యూకే దేశానికి చెందిన ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్.. తాజాగా ముంబయిలో కొన్ని ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వచ్చాడు. తాజాగా జరిగిన ఓ పార్టీలో 'బుట్టబొమ్మ' పాడిన సింగర్ అర్మాన్ మాలిక్‌తో కలిసి ఇదే పాటకు స్టెప్పులేశాడు. అయితే అనుభవం లేకపోవడం వల్ల.. చేతులు, కాళ్లు కదపడానికి ఎడ్ షీరన్ కష్టపడ్డాడు. మరి వార్నర్-షీరన్.. వీళ్లిద్దరిలో ఎవరు బుట్టబొమ్మ స్టెప్పు బాగా వేశారని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement