ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్టు సిరీస్ అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ముగింపు పలికాడు. దీంతో టెస్టుల్లో డేవిడ్ వార్నర్ వారుసుడు ఎవరన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది.
అయితే టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్‌గా వార్నర్ స్ధానాన్ని సీనియర్ స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను స్టీవ్ స్మిత్‌నే ప్రారంభించాలని క్లార్క్ తెలిపాడు. కాగా వార్నర్ స్దానం కోసం మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, మాట్ రెన్‌షా వంటి ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.
"స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా రావాలని నేను కోరుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా వస్తే ఏడాదిలోనే టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాటర్‌గా అవతరిస్తాడు. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఏ స్ధానంలో వచ్చినా మెరుగ్గా రాణించగలడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. అతడు బంతిని చక్కగా గమనించి ఆడుతాడు.
స్మిత్ కూడా ఓపెనర్ పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. అతడు ఓపెనర్‌గా వస్తే 12 నెలల్లోనే అత్యుత్తమ ఓపెనర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు కరేబియన్లతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమవుతోంది. జనవరి 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: David Warner: వార్నర్ ‘గ్రేట్’ క్రికెటర్ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్
Comments
Please login to add a commentAdd a comment