Australia Test
-
'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్టు సిరీస్ అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ముగింపు పలికాడు. దీంతో టెస్టుల్లో డేవిడ్ వార్నర్ వారుసుడు ఎవరన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్‌గా వార్నర్ స్ధానాన్ని సీనియర్ స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను స్టీవ్ స్మిత్‌నే ప్రారంభించాలని క్లార్క్ తెలిపాడు. కాగా వార్నర్ స్దానం కోసం మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, మాట్ రెన్షా వంటి ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. "స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా రావాలని నేను కోరుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా వస్తే ఏడాదిలోనే టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాటర్‌గా అవతరిస్తాడు. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఏ స్ధానంలో వచ్చినా మెరుగ్గా రాణించగలడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. అతడు బంతిని చక్కగా గమనించి ఆడుతాడు. స్మిత్ కూడా ఓపెనర్ పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. అతడు ఓపెనర్‌గా వస్తే 12 నెలల్లోనే అత్యుత్తమ ఓపెనర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు కరేబియన్లతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమవుతోంది. జనవరి 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: David Warner: వార్నర్ ‘గ్రేట్’ క్రికెటర్ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్ -
విజయానికి చేరువలో ఆసీస్
* న్యూజిలాండ్‌తో రెండో టెస్టు * గెలిస్తే నంబర్‌వన్‌గా స్మిత్ సేన క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు విజయం ముంగిట నిలిచింది. కివీస్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నాలుగో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో జో బర్న్స్ (66 బంతుల్లో 27 బ్యా టింగ్; 4 ఫోర్లు), ఖవాజా (23 బంతుల్లో 19 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. ఆటకు నేడు (బుధవారం) చివరి రోజు కాగా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు స్మిత్ సేన ఇంకా 131 పరుగులు చేయాల్సి ఉంది. ఇదే జరిగితే ఆసీస్ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ (110 పాయింట్లు)ను వెనక్కినెట్టి నంబర్‌వన్ స్థానాన్ని పొందుతుంది. అంతకుముందు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేన్ విలియమ్సన్ (210 బంతుల్లో 97; 8 ఫోర్లు) తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... మ్యాట్ హెన్రీ (93 బంతుల్లో 66; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. విలియమ్సన్ 88 పరుగుల వద్ద తమ ఎల్బీ అప్పీల్‌ను తిరస్కరించిన థర్డ్ అంపైర్‌ను పేసర్ హాజెల్‌వుడ్ దూషిం చడం వివాదాస్పదంగా మారింది. బర్డ్‌కు ఐ దు, ప్యాటిన్సన్కు నాలుగు వికెట్లు దక్కాయి. -
ఒక్క మ్యాచ్‌తో నిర్ణయించలేం
కోహ్లి కెప్టెన్సీపై అజహర్ అభిప్రాయం న్యూఢిల్లీ: ఒక్క మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లి నాయకత్వ లక్షణాలపై అంచనాలకు రావొద్దని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. రెగ్యులర్ కెప్టెన్ ఎంఎస్ ధోని గాయం వల్ల ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు దూరం కావడంతో విరాట్ కోహ్లికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఈ టెస్టు ఫలితం ద్వారా కోహ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోని గాయం కారణంగా దూరమయ్యాడు కాబట్టే అతడికి ఈ అవకాశం దక్కింది. అందుకే ఈ ఒక్క మ్యాచ్‌తో మనం అతడి కెప్టెన్సీని అంచనా వేయలేం. ముందు కోహ్లిని ఒంటరిగా వదిలేయాలి. అందరికీ తన బ్యాటే సమాధానం చెబుతుంది. వాస్తవానికి ఆసీస్‌కన్నా మన జట్టే బలంగా ఉంది. వార్నర్‌తో పాటు మరో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆటగాళ్లు ఆ జట్టులో లేరు. ఇలాంటి పరిస్థితిలో మన జట్టు గెలవకుంటే నేను నిరాశపడతాను’ అని అజహర్ తెలిపారు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడడమే అన్నింటికన్నా ముఖ్యమని భారత ఆటగాళ్లకు సూచించారు.