* న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
* గెలిస్తే నంబర్‌వన్‌గా స్మిత్ సేన
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు విజయం ముంగిట నిలిచింది. కివీస్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నాలుగో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో జో బర్న్స్ (66 బంతుల్లో 27 బ్యా టింగ్; 4 ఫోర్లు), ఖవాజా (23 బంతుల్లో 19 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. ఆటకు నేడు (బుధవారం) చివరి రోజు కాగా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు స్మిత్ సేన ఇంకా 131 పరుగులు చేయాల్సి ఉంది.
ఇదే జరిగితే ఆసీస్ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ (110 పాయింట్లు)ను వెనక్కినెట్టి నంబర్‌వన్ స్థానాన్ని పొందుతుంది. అంతకుముందు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేన్ విలియమ్సన్ (210 బంతుల్లో 97; 8 ఫోర్లు) తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... మ్యాట్ హెన్రీ (93 బంతుల్లో 66; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. విలియమ్సన్ 88 పరుగుల వద్ద తమ ఎల్బీ అప్పీల్‌ను తిరస్కరించిన థర్డ్ అంపైర్‌ను పేసర్ హాజెల్‌వుడ్ దూషిం చడం వివాదాస్పదంగా మారింది. బర్డ్‌కు ఐ దు, ప్యాటిన్సన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
విజయానికి చేరువలో ఆసీస్
Published Wed, Feb 24 2016 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement