వార్నర్‌తో పంత్ (PC: IPL/David Warner)
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పునరాగమనం ఖరారైంది. ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.
క్యాష్ రిచ్ లీగ్ పదిహేడవ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ వ్యవహరిస్తాడని ఆ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియా కీలక ఆటగాడైన రిషభ్ పంత్.. డిసెంబరు, 2022లో ఘోర ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.
అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ కోలుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ క్రమంలో టీమిండియా కీలక సిరీస్‌లతో పాటు... ఐపీఎల్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలకు ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్ దూరమయ్యాడు.
జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతూ క్రమక్రమంగా కోలుకున్నాడు. మార్చి 22 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ తాజా ఎడిషన్ నాటికి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో పార్థ్ జిందాల్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ పంత్ రీఎంట్రీని ధ్రువీకరించాడు. అయితే.. తొలి అర్ధభాగం మ్యాచ్‌లలో అతడు వికెట్ కీపింగ్ చేయడని పేర్కొన్నాడు. కేవలం కెప్టెన్సీ, బ్యాటింగ్ సేవలకే పరిమితం అవుతాడని వెల్లడించాడు.
‘‘రిషభ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే వికెట్ కీపింగ్ కూడా మొదలుపెట్టాడు. ఐపీఎల్ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని నమ్మకం ఉంది.
రిషభ్ కచ్చితంగా ఈ సీజన్‌లో ఆడతాడు.. అదే విధంగా కెప్టెన్‌గానూ సేవలు అందిస్తాడని విశ్వసిస్తున్నా. తొలి ఏడు మ్యాచ్‌లలో కేవలం బ్యాటర్‌గానే అతడు బరిలోకి దిగుతాడు. ఒకవేళ తన శరీరం ఆటకు సహకరించకపోతే మాత్రం అతడికి విశ్రాంతినిస్తాం’’అని పార్థ్ జిందాల్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. తాను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రిషభ్ పంత్ ఇటీవల షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. గతేడాది క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించాడు. అయితే, వార్నర్ సారథ్యంలో ఢిల్లీ పదిహేడు మ్యాచ్‌లకు గానూ కేవలం 5 మాత్రమే గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ హోం మ్యాచ్‌లు విశాఖలో.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment