
సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
త్రిపురారం : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం తిపురారంలో నిర్వహించిన భూ భారతి అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రతి భూ సమస్యకు భూ భారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టం ద్వారా మండల స్థాయిలో తహసీల్దార్ల వద్దే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామన్నారు. అంజనపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 335 సర్వే నంబర్‌లో అటవీ భూముల సమస్య మా దృష్టికి వచ్చిందని, పరిష్కరించి గిరిజన రైతులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. త్రిపురారం, దామరచర్ల, కనగల్ మండలాల్లో భూ సమస్యలు గుర్తించామని, సర్వే ద్వారా పరిష్కరిస్తామన్నారు. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్ముకొని కార్యాలయాల చుట్టూ తిరుగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉంటేనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవచ్చాన్నారు. అంతకు ముందు గిరిజనులు వారి సాంప్రదాయ పద్ధతులతో కలెక్టర్ ఇలా త్రిపాఠికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఆర్‌ఐ సైదులు, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి శ్రీనివాస్, నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, వైస్ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ భాస్కర్‌నాయక్, మర్ల చంద్రారెడ్డి, అంబటి సోమయ్య, సంతోష తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం