
నేడు జిల్లాకు మంత్రుల రాక
నల్లగొండ : నల్లగొండ జిల్లాకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం రానున్నారు. జిల్లాలోని బక్కతాయికుంట, కంచనపల్లి, నర్సింగ్‌బట్ల, దోమలపల్లి, పొనుగోడు గ్రామాల్లో రూ.44 కోట్లతో చేపట్టే లిఫ్టు ఇరిగేషన్ పనులకు, రూ.36 కోట్లతో కలెక్టరేట్‌లో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు సోమవారం ఉదయం 10.30 గంటలకు మర్రిగూడ బైపాస్ నుంచి బక్కతాయికుంట వరకు అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో మంత్రులు పాల్గొననున్నారు.
29న కలెక్టరేట్‌లో ప్రజావాణి
నల్లగొండ : కలెక్టరేట్‌లో ఈ నెల 28న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసి ఈ నెల 29న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు ఈ విషయాన్ని గమనించి ఈ నెల 29న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై వారి ఫిర్యాదులను అందజేయాలని పేర్కొన్నారు.
ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
నల్లగొండ : తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో, 7 నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్లలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా సాగిందని డీఈఓ భిక్షపతి తెలిపారు. జిల్లాలోని 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పేర్కొనఆనరు. ఈ పరీక్షకు 907 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
నల్లగొండ : మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్‌కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ చింతమల్ల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన డివిజన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ హక్కులపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఆయన సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. సమావేశంలో పాల్క స్వప్న, బుర్ర రమేష్, సీహెచ్.అజయ్, కమలాబాయి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూకల జగదీశ్చంద్ర, పందిరి శ్యాంసుందర్ కోరారు. ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, జిల్లా కోశాధికారి ఎండీ.అబ్దుల్‌ఖాదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వనం వాణిశ్రీ, వాడపల్లి రమేష్, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజాము న ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.