
యాదగిరిగుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా ఎస్.వెంకట్రావ్ నియమితులయ్యారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓగా 14 నెలులుగా పని చేస్తున్న భాస్కర్‌రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రావ్ గతంలో భువనగిరి డీఆర్‌డీఏ పీడీగా పనిచేసి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు.
మొదటిసారి ఐఏఎస్ అధికారి
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఐఏఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) హోదాలోనే దేవాదాయశాఖ నుంచి అధికారులను నియమించారు. వెంకట్రావ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్, జాయింట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను దేవాదాయశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఈఓగా నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.