
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
హాలియా : రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హాలియాలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హాలియా బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథమన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం దేశ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న కేతావత్ శంకర్‌నాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య, కర్నాటి లింగారెడ్డి, భగవాన్‌నాయక్, కుందూరు వెంకట్‌రెడ్డి, కాకునూరు నారాయణ, వెంపటి శ్రీనివాస్, చింతల చంద్రారెడ్డి, గౌని రాజా రమేష్‌యాదవ్, పిల్లి ఆంజనేయులు, ప్రసాద్‌నాయక్ పాల్గొన్నారు.
ఫ ఎంపీ రఘువీర్‌రెడ్డి