
50 ఏళ్ల ఆత్మీయ సమ్మేళనం
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 1971–74 వరకు బీఏ, బీకాం చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బి. విశ్వనాథంను ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కళాశాలలో మొదటి బ్యాచ్ తమదేనని, తమ బ్యాచ్‌లో మొత్తం 35 మంది ఉండగా.. ఆత్మీయ సమ్మేళనానికి 19 మంది మాత్రమే హాజరయ్యామని పేర్కొన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. వెంకటేశులు, పదవీ విరమణ చేసిన అధ్యాపకులు, ఆనాటి పూర్వ విద్యార్థులు ఎన్. బాల్‌రెడ్డి, ఎన్. పిచ్చిరెడ్డి, శేఖర్‌రెడ్డి, సంజీవరెడ్డి, వెంకటరంగయ్య, కృపాకర్, అమృతారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జానకి రాంరెడ్డి, లింగారెడ్డి, యానాల సుదర్శన్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.