
ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తిప్పర్తి: ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా ఆయా కేంద్రాల నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కాంటాలు వేయాలన్నారు. ప్రతిరోజూ ట్రక్ షీట్‌లు డీఎం కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఆయన వెంట ఏపీఎం శ్రీదేవి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు.
వక్ఫ్‌బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలోని మగ్దూమ్ భవన్‌లో జరిగిన ఆ పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టంతో మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు. బొడ్డుపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, అంజయ్యచారి, బొల్గూరి నర్సింహ, టి.వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య పాల్గొన్నారు.
యువత అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి
చివ్వెంల(సూర్యాపేట) : యువత.. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం మున్యానాయక్ తండా ఆవాసం పీక్లాతండాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు లేని సమసమాజం నిర్మించడమే అంబేడ్కర్ ఆశయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మర్ ఇస్లావత్ రామచంద్రనాయక్, షెడ్యూల్డ్ కులాల అధికారులు కె.శంకర్, లత, తహసీల్దార్ కృష్ణయ్య, లంబాడీ విద్యార్థి సేనా రాష్ట్ర నాయకుడు ధరావతు బాలు నాయక్, మాజీ సర్పంచ్ బీకారి, మాజీ ఎంపీటీసీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
చేతికందిన బొప్పాయి నేలపాలైంది
ఈయన పొగాకు నారాయణ. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామం. ఈయన పిట్టలగూడెంలో ఆరెకరాలు కౌలుకు తీసుకుని బొప్పాయి సాగుచేశాడు. ఏడాదిన్నర నుంచి రూ.6 లక్షల పెట్టుబడి పెట్టాడు. మొదటి పంట 5 టన్నులు మాత్రమే కోశాడు. మిగిలిన దాదాపు 20 టన్నుల పంట కోదామనుకునేలోపే ఇటీవల వడగండ్ల వానకు తోట నేలపాలైంది. గాలి వానకు దిగుబడి దశలో ఉన్న 300 మొక్కలు నేలకూలగా మరో 300 మొక్కలపై భాగం, కొమ్మలు విరిగిపోయాయి. కాయలు, పూత, పిందె అంతా నేలపాలైంది. 20 టన్నులకుగాను సుమారు నాలుగు లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని నారాయణ ఆవేదనచెందుతున్నాడు.

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే