
న్యాయవాద సవరణ చట్టం వద్దేవద్దు
రామగిరి(నల్లగొండ): న్యాయవాద సవరణ చట్టం–2025 బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.అనంతరెడ్డి, కార్యదర్శి ఎం.నగేష్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్‌లో గురువారం ఐలు సంఘం ముద్రించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం న్యాయవాద చట్టం 1961ను మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. దీనివల్ల న్యాయవాద వృత్తి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తికి ప్రమాదకరంగా మారనున్న కొత్త చట్టం వద్దేవద్దన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, పి.శేఖర్, పి.బ్రహ్మా చారి, డి.నర్సాజి, ఎం.బాలయ్య, నగేష్, మసీయుద్దీన్, కిషోర్‌కుమార్, సీహెచ్. జైపాల్, ఏ.బాలయ్య, నజురుద్దీన్, లింగయ్య, రమేష్, ప్రకాష్, నరసింహ పాల్గొన్నారు.