
అంబేడ్కర్, పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం
నల్లగొండ టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, విద్యా వ్యాప్తి, కుల వివక్షత నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయులు అంబేడ్కర్, పూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రొపెసర్ ఖాసీం అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే, అంబేడ్కర్ జన జాతరలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పూలే, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల విద్యాభివృద్ధికి పూలే సతీమణి సావిత్రీబాయి పూలే ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, ఏపూరి సోమన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, పాలడుగు నాగార్జున, దుడుకు లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి రవి, ఆయా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్, పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం