
రాజ్యాంగం వల్లే.. హక్కులు, పదవులు
నల్లగొండలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళుర్పిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ సత్యం, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనప కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు
నల్లగొండ టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు, బాధ్యతలు, పదవులను పొందగలుగుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డీఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా అంబేడ్కర్ పొందు పరిచిన ఆర్టికల్స్ వల్లే తాను ఐఏఎస్ కాగలిగానని చెప్పారు. భవిష్యత్‌లో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే వారికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే స్ఫూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను ఈ నెల 14 నుంచే అమల్లోకి తీసుకురానుందని ఇది చరిత్రలో నిలిచిపోనుందన్నారు. ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ చదువును ఆయుధంగా తీసుకుని సామాజిక మార్పును తీసుకొచ్చిన మహానుబావుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఆయా సంఘాల నేతలు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, నకిరెకంటి కాశయ్యగౌడ్, బొర్ర సుధాకర్, పాలడుగు నాగార్జున, కత్తుల జగన్‌కుమార్, గోలి ఏడుకొండలు, కత్తుల షన్ముఖకుమార్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నూనె వెంకటస్వామి, బకరం శ్రీనివాస్, బాషపాక హరికృష్ణ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి