
హైవేపై వాహనాల రద్దీ
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. శుభకార్యాలు ఉండటంతో హైదరాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల ప్రజానీకం వాహనాల్లో రాకపోకలు సాగించారు. దీంతో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వైపు విపరీతమైన రద్దీ నెలకొంది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్‌ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు.