
రేషన్ కార్డులేక.. బియ్యం అందక..
కొత్త వారికి మరింత సమయం!
అయితే జిల్లా అధికారులు అప్రూవల్ చేసిన రేషన్‌కార్డు దరఖాస్తులపై ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే జిల్లాలో ఆ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చే అవకాశం ఉండనుంది. అయితే జిల్లాలో ఉన్న డేటా అంతా ఆన్‌లైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా అధికారులు అప్రూవల్ చేసిన జిల్లాలోని దరఖాస్తుదారులకు సన్న బియ్యం అందేది కష్టమని తెలుస్తోంది.
నల్లగొండ: కొత్త రేషన్‌కార్డులతోపాటు పిల్లల పేర్లు చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ కార్డులు మంజూరు కాలేదు. దీంతో ఆయా దరఖాస్తుదారులందరికీ ఇప్పట్లో సన్న బియ్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే కొత్తగా పైళ్లెన వారు రేషన్ కార్డు కోసం అర్జీపెట్టుకోగా పాత కార్డులో వారి పేర్లు తొలించారు. దీంతో జిల్లాలో 69 వేల మందికిపైగా ఇటు పాత కార్డుపై బియ్యం అందక, కొత్త కార్డు రాక రేషన్ బియ్యానికి దూరం అవుతున్నారు.
దరఖాస్తులు స్వీకరించి..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో కొంత మందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందించింది. ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో జనం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో కొత్తగా పైళ్లెన వారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో వారిపేర్లు పాత కార్డుల్లో తొలగించారు. ఎన్నికల తరువాత కార్డులు ఇస్తారని భావించారు కానీ ప్రభుత్వం మారవడంతో సాధ్యం కాలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. మరలా బీసీ కులగణన సమయంలో 27,523 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన జిల్లా అధికారులు దాదాపు 69,473 దరఖాస్తులను అప్రూవల్ చేసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు పంపించారు. వీటిని ప్రభుత్వం ఇంకా ఓకే చేయలేదు. దీంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు.
ఫ పాతకార్డుల్లోనూ పేర్లు తొలగింపు
ఫ మార్పులు, చేర్పుల అర్జీలు పెండింగ్‌లోనే..
ఫ నిరీక్షణలో 69,473 మంది దరఖాస్తుదారులు