
మరిన్ని నీళ్లు..
సాగునీటికి మొదటి ప్రాధాన్యం
రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
- 8లో
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కనగల్, నల్లగొండ మండలాల్లో ఐదు ఎత్తిపోతల పథకాలను రూ.46 కోట్లతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సోమవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ పట్టణ సమీపంలోని బక్కతాయికుంట వద్ద నాలుగు లిప్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఐదు లిఫ్టుల ద్వారా నియోజకవర్గంలో 4,217 ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఐదు లిఫ్ట్‌లు ఇవే..
● కనగల్ మండలం పొనుగోడు వద్ద రూ.6.83 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కెనాల్ నుంచి ఊర చెరువులో లిఫ్టు ద్వారా రెండు పంపులను ఏర్పాటు చేసి నీళ్లను ఎత్తిపోస్తారు. దీని ద్వారా పొనుగోడులోని 510 ఎకరాలకు సాగునీరు అందనుంది.
నర్సింగ్‌భట్ల, దోమలపల్లి వద్ద రూ.18.95 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. ఈ రెండింటి కింద మొత్తంగా 2,484 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
● నర్సింగ్‌బట్ల లిఫ్ట్ ద్వారా గంగదేవి చెరువులో ఏఎమ్మార్పీ కాల్వ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. దానికింద దోనకల్ (464), గూడాపూర్ (145), కె.కొండారం (62), నర్సింగ్‌భట్ల (1088), కుందవన్‌పూర్‌లో (113), మొత్తంగా నర్సింగ్‌భట్ల లిఫ్ట్ కింద 1,872 ఎకరాలకు సాగునీరు అందనుంది.
● దోమలపల్లి వద్ద ఎత్తిపోతల ద్వారా పెద్ద చెరువులో నీరు నింపి ఎం. దోమలపల్లి, పి.దోమలపల్లికి సాగునీటిని అందించనున్నారు. దీనికింద 612 ఎకరాలకు నీరందనుంది.
కంచనపల్లి, బక్కతాయికుంట ఎత్తిపోతల పథకా లను రూ.20.22 కోట్ల అంచనాతో నిర్మించనున్నారు.
● కంచనపల్లి లిఫ్ట్‌తో ఏఎమ్మార్పీ కాల్వ నుంచి పొల్కంచెరువుకు నీటిని ఎత్తిపోయనున్నారు. దీని ద్వారా 723 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. అందులో గుండ్లపల్లిలో 49 ఎకరాలు, కంచనపల్లిలో 674 ఎకరాలకు సాగునీరు అందనుంది.
● బక్కతాయికుంట లిఫ్టు ద్వారా ఆర్జాలబావి, మర్రిగూడెం గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే నల్లగొండ పట్టణంలో భూగర్భజలాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
నల్లగొండ నియోజకవర్గంలో రూ.46 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణం
ఫ లిఫ్టులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ 4,217 ఎకరాలకుఅందనున్న సాగు నీరు

మరిన్ని నీళ్లు..