
పోలీస్ అమరవీరుల స్మారక భవనం ప్రారంభం
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పునర్నిర్మించిన పోలీస్ అమరవీరుల స్మారక భవనాన్ని సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అమరవీరుల స్మారక భవనాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్‌రెడ్డి, ఆదిరెడ్డి, రాజశేఖర్, కొండల్‌రెడ్డి, ఆర్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.