
నేడు మిర్యాలగూడ మంత్రి ఉత్తమ్ రాక
ఫ ఇరిగేషన్, పౌరసరఫరాలపై సమీక్ష
మిర్యాలగూడ : రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం మిర్యాలగూడకు రానున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు స్థానిక టీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎడమకాల్వ పరిధిలోని ఎత్తిపోతల పథకాల అభివృద్ధి పనులు, సాగర్ ప్రాజెక్టులోని నీటి నిల్వ, పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపుల్లో అందించే సన్నబియ్యం పంపిణీ, గోదాంలో బియ్యం నిల్వ, కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకానున్నారు.
బాధితులకు సత్వర న్యాయం అందాలి
నల్లగొండ : బాధితులకు సత్వర న్యాయం అందేలా సిబ్బంది పని చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 30 మంది బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి మాట్లాడారు. బాధితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగింగచే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
కొనసాగుతున్న ‘ఓపెన్’ పరీక్షలు
నల్లగొండ : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం కొనసాగాయి. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 1902 మందికి 1623 మంది హాజరయ్యారు. 279 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 1464 మందికి 1235 మంది హాజరు కాగా 229 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఐసీహెచ్ పరీక్షకు 8 మందికి గాను ఆరుగురు పరీక్ష రాయగా, ఇద్దరు పరీక్షకు హాజరు కాలేదు. పరీక్ష కేంద్రాలను డీఈఓ, ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
దరఖాస్తులకు నేడు ఆఖరు
నల్లగొండ : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశ దరఖాస్తులకు మంగళవారం (నేడు) ఒక్క రోజే గడువు ఉందని జిల్లా పరిశ్రమల శాఖ జేడీ వి.కోటేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండొద్దని.. టెన్త్/ఇంటర్/ఐటీఐ/ పాలిటెక్నిక్ డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల వారు pminterns hip.mca.gov.in పోర్టల్‌లో లాగిన్ అయి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సర్టిఫికెట్లు అందజేత
రామగిరి(నల్లగొండ): వృత్తి కోర్సులు నేర్చుకోవడం వల్ల జీవన నైపుణ్యం పెంపొందుతుందని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరాజు అన్నారు. వృక్ష శాస్త విభాగం ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెనింగ్ (మిద్దె తోట) పై 30 రోజుల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సోమవారం కళాశాలలో సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. క్యార్యక్రమంలో వృక్ష శాస్తం ఇన్‌చార్జ్ డాక్టర్ టి. అరవింద, వృక్షశాస్త అధ్యాపకులు ఎ.సంధ్య, డాక్టర్ జి.సరిత, డాక్టర్ పి.సునీత, అతుఫా పాల్గొన్నారు.

నేడు మిర్యాలగూడ మంత్రి ఉత్తమ్ రాక