
దోపిడీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
నల్లగొండ టౌన్ : దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండలోని 3వ వార్డులో రుద్రాక్షి ఎర్రయ్య, లింగమ్మ స్మారక స్థూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వివిధ కారణాలతో పార్టీని వీడిన వారంతా తిరిగి సీపీఎంలోకి రావాలని పిలుపునిచ్చారు. పూటకో పార్టీ మారే భూస్వాములకు, కార్పొరేట్లకు వంత పాడుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రజలు తిరస్కరించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎర్రయ్య చూపిన మార్గంలో కూలి, భూమి పోరాటాల్లో పాల్గొనడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో దండంపల్లి సత్తయ్య, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ఎండీ.సలీం, వెంకట రమణారెడ్డి, సైదులు, మన్నె భిక్షం, పద్మ, అద్దంకి నరసింహ, గణేష్, అశోక్‌రెడ్డి, నరేష్, రవీందర్, లింగయ్య, రుద్రాక్షి రామచంద్రయ్య, యాదయ్య, దుర్గయ్య, జానయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.