
సాగు అంచనా.. 11.60 లక్షల ఎకరాలు
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
ముందస్తుగానే సిద్ధం చేస్తున్నాం..
వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగానే సిద్ధం చేస్తున్నాం. అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ, నల్లగొండ
నల్లగొండ అగ్రికల్చర్: వానాకాలం –2020–25కు గాను జిల్లా వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ యంత్రాంగం జిల్లా కలెక్టర్ అనుమతితో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది.
విత్తనాలు ఇలా: వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి, వరి, కంది, పెసర, వేరుశనగ విత్తనాలను సిద్ధం చేయనుంది. పత్తి ప్యాకెట్లు 11.81 లక్షలు, వరి 1,26,800 క్వింటాళ్ల వివిధ రకాలకు సంబంధించిన విత్తనాలు అవసరం అని అంచనా వేసింది. కంది 1,250 క్వింటాళ్లు, పెసర 149 క్వింటాళ్లు, వేరుశనగ 1,545 క్వింటాళ్లు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది.
ఎరువులు: వానాకాలం సీజన్‌కు సంబంధించి 3,66,869 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. యూరియా 1,44,802 మెట్రిక్ టన్నులు, డీఏపీ 61,343 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 33,758 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,14,043 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 12,923 మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది.
పంటల వారీగా సాగు అంచనా ఇలా..
(ఎకరాల్లో..)
ఫ విత్తనాలు, ఎరువులకు ప్రతిపాదనలు
ఫ ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా వ్యవసాయ శాఖ
ఫ గతంలో కంటే సాగు విస్తీర్ణం 10వేల ఎకరాలు పెరిగే అవకాశం

సాగు అంచనా.. 11.60 లక్షల ఎకరాలు