తెలంగాణకు ఏపీ ఇసుక | - | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఏపీ ఇసుక

Published Fri, Apr 18 2025 1:35 AM | Last Updated on Fri, Apr 18 2025 1:35 AM

తెలంగాణకు ఏపీ ఇసుక

తెలంగాణకు ఏపీ ఇసుక

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొందరు లారీల్లో ఇసుకను సరిహద్దులు దాటించి తెలంగాణలో విక్రయిన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని తెలంగాణ నేతలతో కుమ్మకై ్క ఈ దందాకు తెరతీసినట్లు తెలిసింది. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా ముత్యాల, పల్నాడు జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను కొందరు వ్యాపారులు లారీల్లో సామర్థ్యానికి మించి (ఒక్కో దాంట్లో 30 –35 టన్నులు) పట్టాలు కట్టి కనిపించకుండా దాచి సరిహద్దు దాటిస్తున్నారు. చెక్‌ పోస్టులు ఉన్న కోదాడ, నాగార్జునసాగర్‌, వాడపల్లి ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఫ్‌లైయాష్‌ పేరుతో అక్కడి సిబ్బంది కళ్లు కప్పి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చెక్‌పోస్టులు లేని ప్రాంతాలైన ముత్యాల–దొండపాడు, పులిచింతల బ్రిడ్జీ, మట్టపల్లి బ్రిడ్జీ, జాన్‌పహడ్‌ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 14వ తేదీన మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి దాచేపల్లి మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుకను ఆ లారీలో తరలిస్తుండగా అద్దంకి – నార్కట్‌పల్లి ప్రధాన రహదారిలో మిర్యాలగూడ మండలం కిష్టాపురం సమీపంలో పట్టుకున్నట్లు మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. పోలీసు వాహనానాన్ని చూసి లారీ వేగంగా వెళ్తుండగా అనుమానం వచ్చి ఆపామని, లారీకి సంబంధించిన ఇసుక వివరాలను అడిగామని, ఎలాంటి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లారీని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్‌

ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి మిర్యాలగూడలో నార్కట్‌పల్లి – అద్దంకి జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున అర్ధరాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటుక బట్టీల్లో ఉపయోగించే ఫ్‌లైయాష్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పి ఇసుకను తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో సన్న ఇసుకకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉండటంతో ఏపీ నుంచి ఇసుకను తరలించి, తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు. ఈ ఇసుకను హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇసుకను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాలో తెలంగాణ రిజిస్ట్రేషన్‌ కలిగిన వాహనాలనే వినియోగిస్తూ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడ నియోజకవర్గంలోని మూడు రీచ్‌లు ఏడాది కాలంగా మూతపడటంతో ఈ ప్రాంతంలో ఏపీ నుంచి వస్తున్న ఇసుకను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. హుజూర్‌నగర్‌, కోదాడ, నల్లగొండ ప్రాంతాల్లోనూ ఇలా తీసుకువచ్చిన ఇసుకను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఏపీకీ చెందిన కొందరు ప్రముఖులు తెలంగాణకు చెందిన సరిహద్దు రాజకీయ నాయకులుతో కుమ్మకై ్క ఇసుక దందాకు తెరతీశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రా నుంచి అక్రమంగా రవాణా

ఫ ఫ్లైయాష్‌ పేరుతో ఇసుక తరలింపు

ఫ చెక్‌పోస్టులు లేని ప్రాంతాల నుంచి వస్తున్న లారీలు

ఫ హైదరాబాద్‌తో పాటు నల్లగొండ జిల్లాలో విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement