
ముంపు బాధితుల భూములు ఆన్‌లైన్‌లో తొలగింపు
చందంపేట : సాగర్ ముంపు బాధితులకు కేటాయించిన డీ ఫారెస్ట్ భూమిని అధికారులు రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ నుంచి తొలగించారు. మొన్నటి వరకు ఆన్‌లైన్‌లో భూమి ఉండడంతో ఆయా రైతులు రైతుబంధు సాయం, పంట రుణాలు సైతం పొందారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో భూములు లేకపోవడంతో పెట్టుబడిసాయం, రుణాలు అందడం లేదు. భూములను తిరిగి ఆన్‌లైన్‌లో చేర్చాలని ఆయా రైతులు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఎన్నిమార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు.
కుటుంబానికి ఐదెకరాలు..
చందంపేట మండలంలోని బుడ్డోనితండా పంచాయతీ పరిధిలోని కాకనూరితండాలో సాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వం 1970లో ఇక్కడి అటవీ భూములను కేటాయించింది. అప్పట్లో కుటుంబానికి ఐదు ఎకరాల చొప్పున డీ ఫారెస్ట్ పట్టాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయా కుటుంబాలు భూములు సాగుకు యోగ్యం చేసుకుని పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల 33 మంది రైతులకు చెందిన 120 ఎకరాల భూమిని క్రితం ధరణి వెబ్‌సైట్ నుంచి తొలగించారు. దీంతో ఆయా రైతులు ప్రభుత్వ లబ్ధిని పొందలేకపోతున్నారు. వీరి భూములను ఆన్‌లైన్‌లో తొలగించడంతో న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ భూములను తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతు బంధు సాయం, రుణ మాఫికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఫ ప్రభుత్వ సాయాన్ని కోల్పోతున్న రైతులు
ఫ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం