
ప్రారంభానికే పరిమితమా ?
మునుగోడు : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు అధికారులు వారం రోజుల క్రితం మునుగోడు మండలంలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నేటికీ ఏ ఒక రైతు ధాన్యం కూడా తూకం వేయలేదు. దీంతో పది పదిమేను రోజులుగా.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. మండల వ్యాప్తంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో 50 నుంచి 200 మంది రైతులు ధాన్యం రాశులు పోశారు. అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం ఆరబెడుతూ.. సాయంత్రానికి రాశి చేస్తున్నారు. మరోవైపు ఆకాలు వర్షాలు కురుస్తుండడంతో తమ ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కొనుగోళ్లు ప్రారంభించాల రైతులు కోరుతున్నారు.