
ముగిసిన మహనీయుల జయంతి ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 57 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడప సత్యనారాయణ, వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అల్వాల రవి, అరుణప్రియ, కొప్పుల అంజిరెడ్డి, శ్రీదేవి, ప్రేమ్‌సాగర్, సుధారాణి, వసంత, రేఖ, సరిత, కళ్యాణి, దోమల రమేష్, సబీనా హెరాల్డ్, వై.ప్రశాంతి పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లను
రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు సైదిరెడ్డి, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గుర్రంవెంకట్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బొంగురాల నర్సింహలు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతానికి 19న టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించే సదస్సుకు కార్మికులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఎండీ.సలీం, పరిపూర్ణచారి, ఆర్.ఆచారి, బోడ ఇస్తారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన మహనీయుల జయంతి ఉత్సవాలు